NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నంద్యాల జిల్లా విద్యాధికారి ఉన్నారా.. ?

1 min read

డోన్, న్యూస్ నేడు:  డోన్ పట్టణం లోని శ్రీ చైతన్య  విద్య సంస్థలకు తాళం వేస్తారా ?? లేకే మండల మరియు ఉపవిద్యాధికారి కార్యాలయంలకు తాళం వేయ మంటారా?పర్మిషన్ లేని శ్రీ చైతన్య విద్యాసంస్థల ని ప్రోత్సహిస్తున విద్య అధికారులు…తల్లీ దండ్రులకు మా మనవి మీ పిల్లల్ని శ్రీ చైతన్య విద్య సంస్థలో చేరిచే ముందు ఒకసారి ఆలోచించండి..డోన్ పట్టణం లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటి విద్యార్థి ఐక్యవేధిక కార్యక్రమంలో పాత్రికేయులు సమావేశంలో మాట్లాడుతూన రాష్ట్ర అధ్యక్షులు ఇమిడి లక్ష్మణ్ సాయి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆయా విద్య సoస్థల పై చర్యలు తీసుకోవడానికి ముందుకు రాని మండల మరియు జిల్లా అధికారులు, అసలు జిల్లా విద్య అధికారి అనేవారు ఉన్నారా లేక లేర అనేది ప్రశ్నఅంతకంగా ఉంది.డోన్ లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాలకు కొముఖాస్తున విద్య అధికారులు.ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యులు కొత్త కొత్త చదువుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ కనీస తల్లీ దండ్రులకు కూడా మరియద ఇవని వైనం డోన్ పట్టణం లోని శ్రీ చైత్యన విద్య సంస్థ లో కనిపిస్తుంది అసలు  శ్రీ చైతన్య విద్య సంస్థకు పర్మిషన్లు లేకపోయినా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు మరియు పాఠశాలలో పాఠ్య, నోట్ పుస్తకాలను అమ్ముకుంటూ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల సమాచార యాప్ లు, ఎస్ట్ర యాక్టివిటీస్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ వారిని దోచుకుంటున్నారని ,అదేవిదంగా విద్యార్థుల తల్లీ దండ్రులకి కనీస మరియద కూడా ఇవని విద్య సంస్థ యాజమాన్యం కు  మండల , జిల్లా విద్య అధికారులు కొమ్ము కాస్తున్నారే తప్ప ఆ పాఠశాలలపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదని వారి దోపిడీకి పరోక్షంగా విద్యాధికారులే సహకరిస్తున్నారని ఎస్టీ,ఎస్సీ,బీసీ,మైనారిటీ,విద్యార్థి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఇమిడి లక్ష్మణ్ సాయి ఆరోపించారు.ఇప్పటికైనా విద్య అధికారులుడోన్ లోని శ్రీ చైత్యన విద్య సంస్థకు తాళం వేయకపోతే-మండల మరియు జిల్లా ఉప విద్యాధికారుల కార్యాలయలకు మిము తాళం వేసే పరిస్థితి తెచ్చుకొంటారూ అని హెచ్చరించారు. తక్షణమే శ్రీ చైత్యన విద్య సంస్థ పైన చరియలు తీసుకోకపోతే విద్యార్థి ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్దయతున ఉద్యమానికి పిలుపునిస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్ , స్సభ్యులు మనోజ్,వంశీ,మదన్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *