NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో వాలంటీర్ వ్య‌వ‌స్థ పై ఏపీ హైకోర్టు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను నిర్ణయించేందుకు వారికున్న అధికారం ఏమిటని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలంటీర్‌ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వారు అసలు ప్రభుత్వ ఉద్యోగులేనా? సర్వీసు రూల్స్‌ ఉన్నాయా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్ల జోక్యం ఏమిటని నిలదీసింది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్‌, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడు.. ప్రభుత్వ ఉద్యోగులే కాని వలంటీర్లతో లబ్ధిదారులను ఎందుకు ఎంపిక చేయిస్తున్నారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సంబంధిత వలంటీర్లు, అధికారులకు నోటీసులు జారీచేసింది. విచారణ వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు.

                                           

About Author