దేశంలో గవర్నర్లు అవసరమా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : దేశంలో గవర్నర్ పదవులు అనవసరమైనవని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ అభిప్రాయపడ్డారు. చెన్నైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమిళనాట ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభలో రూపొందించిన ముసాయిదా బిల్లులపై గవర్నర్ 3 నెలలు గడిచినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో దేశం లో గవర్నర్లు అవసరమా? ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదా? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్లు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, తాము అనుకున్నట్టుగానే ఫాసిస్ట్ ధోరణులతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.