NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీఆర్ ఆంధ్రాలో పార్టీ పెడ‌తానంటే ఎవ‌రైనా వ‌ద్దన్నారా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీలో క‌రెంటు కోత‌లు విధిస్తున్నార‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల‌పై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే తెలంగాణ‌కు మిగులు క‌రెంట్ వ‌చ్చింద‌న్నారు. హైద‌రాబాద్ లేకుండా రాష్ట్రాన్ని విభ‌జిస్తే ఏపీ అంధ‌కారంలో ఉంటుంద‌ని ముందే చెప్పామ‌ని అన్నారు. ఏపీలో టీఆర్ఎస్ పెట్టమ‌ని ప్రజ‌లు కోరుతున్నార‌న్న కేసీఆర్ వ్యాఖ్యల‌పైన స‌జ్జల స్పందించారు. కేసీఆర్.. ఆంధ్రాలో పార్టీ పెడ‌తామంటే ఎవ‌రైనా వ‌ద్దన్నారా?.. ఎవ‌రూ వ‌ద్దని చెప్పలేద‌న్నారు . రాజకీయ పార్టీ ఎవ‌రు ఎక్కడైనా పెట్టుకోవ‌చ్చని, దానికి ఎవ‌రి అనుమ‌తి అవ‌స‌రంలేద‌న్నారు. ఎవ‌రైనా ఎక్కడైనా పోటీ చేయ‌వ‌చ్చని చెప్పారు.

About Author