గ్రూప్ 1.2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లేనట్టేనా ?
1 min readపల్లెవెలుగువెబ్ : త్వరలో భర్తీ చేయనున్న గ్రూప్ –1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తీసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణులు, టీఎస్పీఎస్సీ అధికారులతో చర్చించి నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే, ఈ నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఫైలును న్యాయ శాఖకు పంపడంతో పాటు కేబినెట్ ఆమోదం అవసరమా.. కాదా.. అనే విషయంలోనూ లోతుగా పరిశీలించాయి.