కంపు కొడుతున్న కాలనీలు స్వచ్ఛ సర్వేక్షన్ ఇదేనా..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: స్వచ్ఛ సర్వేక్షన్ అంటూ గ్రామాలలో ర్యాలీలు తీస్తూ ప్రజలకు విద్యార్థులకు చుట్టుపక్కల ఇంటి పరిసరాలలో చెత్త నీటి గుంటల లో దోమ లార్వాలు నిలువ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చేతి శుభ్రత పరిసరాల శుభ్రత పాటించాలని అవగాహన కల్పిస్తున్న అధికారులకు వారు పరిష్కరించవలసిన సమస్యలు గాలికి వదిలేస్తూ చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉండడం పబ్లిసిటీలో ఉన్న ధ్యాస క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంపై ఉంచటం లేదని మండల కేంద్రమైన గడివేములలో ఇద్దరు పంచాయతీ అధికారులు ఉన్న కార్యాలయానికే పరిమితమై క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన గాని సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపడం లేదని మండల కేంద్ర ప్రజలు ఆరోపిస్తున్నారు కాలనీవాసులకు పలు రోగాలకు గురిచేస్తుంది గడివేముల బీసీ కాలనీలో ఏడాది పొడుగునా రహదారిపై మురుగు నీరు నిలుస్తుండడంతో దోమలు పెరిగి జ్వరాల బారిన పడుతూ కంపు వాసన భరిస్తుండడం ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన ఇప్పటివరకు కనీసం రోడ్డుపై ఉన్న బురదను తీయడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు సదరు కాలనీలో పేరుకుపోయిన మురుగు నీరు తొలగించి రోగాలు బారిన పడకుండా కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.. పేరుకే మండల కేంద్రమైన ఎంపీడీవో ఈఓఆర్డి ఇద్దరు పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది ఉన్న గ్రామాలలో ఉన్న పరిశుభ్రత మండల కేంద్రంలో కాలనీలో ఉండడం లేదని వీరి పనితనానికి నిదర్శనంగా నిలుస్తుంది డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో మురుగునీరు పొంగిపొర్లి రోడ్లపై పారడంతో వాటిపై భారీ వాహనాలు తిరగడంతో దుమ్ము ధూళి గాలిలో కలిసిపోయి విపరీతమైన దుర్వాసన ఊపిరితిత్తుల వ్యాధులకు నిలయంగా మండల కేంద్రం మారిపోయింది
అధికారులకు చాలాసార్లు చెప్పాం అయినా స్పందించడం లేదు. ఉప సర్పంచ్ బాల చేన్ని
బీసీ కాలనీలో రోడ్లు బురదమయంగా మారి దుర్వాసన వెదజల్లుతున్నాయి దోమలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల బీసీ కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు డ్రైనేజీలలో నీరు నిలువ ఉండి కొన్నిచోట్ల డ్రైనేజ్ కాలువలు పగిలిపోవడంతో రోడ్డుపై బురద నీరు పారుతున్నాయని కనీసం వారానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తమకు ఇబ్బందికరంగా మారిందని ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని ఉప సర్పంచ్ కోరారు.