PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి అసలు కారణం ఇదేనా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి బలమైన కారణం ఉందని రష్యా మీడియా చెబుతోంది. ఇటీవల రష్యా మీడియాలో వెలువడిన కథనాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఉక్రెయిన్ అణు ఆయుధాల తయారీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడమే యుద్ధానికి అసలు కారణమని రష్యన్ మీడియా కథనాలు వెలువరించింది. చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రంలో ఉక్రెయిన్ అణ్వాయుధాలు అభివృధ్ది చేస్తోందన్న రష్యా ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యలను ఆ దేశ వార్తా సంస్థలు ప్రచురించాయి. అణ్వాయుధాలు వదులుకుంటున్నట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం 1994లో ప్రకటించింది. ఉక్రెయిన్ తిరిగి అణుబాంబులు తయారు చేయడం అంటే అది రష్యాపై యుద్ధం ప్రకటించడమేనంటూ పుతిన్ వ్యాఖ్యానించినట్టు రష్యా మీడియా పేర్కొంది.

        

About Author