PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదర్శ మున్సిపాలిటీ అంటే ఇదేనా?

1 min read

– డిసిసి మైనార్టీ అధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య  జిల్లా కేంద్రమైన రాయచోటి మున్సిపాల్టీలో   పారిశుధ్య నిర్వహణ గాడి తప్పిందని, పట్టణంలో ఎక్కడ చూసినా  చెత్తాచెదారం దర్శన మిస్తోందని, వున్న కాలువలు పూడికలతో నిండి కంపుకొడుతున్నా , వార్డుల్లో పరిస్థితి మరింత అధ్వానంగా మారినా పట్టించుకునేవాడు నాధుడే  లేడని డి సిసి మైనార్టీ అధ్యక్షుడు ఆడిటర్ ఇన్సూర్ ఆలీ ఖాన్ ఆరోపించారు. ప్రభుత్వ పాలకులు  ఆదర్శ మున్సిపాలిటీ అని గొప్ప లు చెప్తున్నారు  పట్టణంలో మాత్రం, పారిశుధ్య పనులపై పూర్తిగా పర్యవేక్షణ కొరవడిందన్నారు. దీంతో ఒక వైపు ఎండలు. మరోవైపు దోమలతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాడ వాడలా ప్రజలు రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నారని పట్టణంలో పారిశుధ్యం పడకేసినా సంబంధిత అధికారులు చొరవ చూపక పోవడం  బాధాకరమని డిసిసి మైనార్టీ అధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ అన్నారు.ఆదివారం మున్సిపా లిటీ  పరిధిలోని పలు వార్డుల్లో ఆయన డీసీసీ ఉపాఅధ్యక్షుడు ధర్భర్ భాష, మాజీ పట్టణ అధ్యక్షుడు ఫారుక్ లతోకలసి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూగ్రేడ్ వన్, ఆదర్శ మున్సిపాలిటీ అంటే ఇదేనా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుమారుగా 90 వేల మంది ఓటర్లు వున్న మున్సి పాలిటీ పరిధిలోని 36 వార్డుల లో కొన్ని వార్డులైతేఅద్వానంగా  ఉన్నాయి, సిసి రోడ్లు లేవు, సైడ్ కాల్వలు లేవు, మట్టి రోడ్ల అంత గుంతల మయం, రాత్రిపూట కరెంటు పోతే పాదాచార్యులు, ద్విచక్రవాహనదారులు గుంతల్లో పడి కాళ్లు చేతులకు గాయాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నారు.

9వ వార్డు లో వెంటనే మౌళిక

వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణ మన్నారు.ప్రధానంగా వార్డు ల్లోఎప్పటికప్పుడుచెత్తాచెదారాలను తొలగించడం లేదు. వున్న కాలువల్లో పూడికలు తీయిం చడం లేదు. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. వార్డు వాసులు నానా అవస్థలు పడుతున్నా అధికారులు స్పందించక పోవడం బాధాకరం. మలేరియా, డెంగ్యూ వంటి ఇతరత్రా వ్యాధుల బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన మున్సిపాల్ అధికారులపై మండిపడ్డారు.ప్రజారోగ్యంపై దృష్టి సారించకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు.ముస్లిం మైనార్టీల ఓట్లతో అధికారాన్ని చేపట్టిపదవులను అనుభ వి స్తున్నప్రజాప్రతినిధి,నాయకులు, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజమైన ఆదర్శ మున్సిపాలిటీ ఎలా ఉంటుందోపట్టణప్రజలకు చూపిస్తామన్నారు.

About Author