స్వచ్ఛ సంకల్పం అంటే ఇలా ఉంటుందా…
1 min read
మహానంది , న్యూస్ నేడు: పల్లె వాతావరణం లో స్వచ్ఛ సంకల్పం అంటే ఇలా గనే ఉంటుందా…. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు ఏవైనా స్వచ్ఛ సంకల్పం పేరుతో గ్రామాల్లో పరిశుభ్రత ,పచ్చదనం ఉండాలని దిశా నిర్దేశం చేస్తాయి. వాటిని అన్నిటిని తుంగలో తొక్కి మూలన పడేస్తే గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. మండలంలోని మేజర్ పంచాయతీ అయినా ఒక గ్రామంలో వీధుల వెంట ఉన్న చెత్తను తొలగించి, తరలించడానికి మూడు చక్రాల బండ్లను గ్రామ పంచాయతీకి అందజేయడం జరిగింది. వీటితోపాటు 2 ఎలక్ట్రి వాహనాలు, ట్రాక్టర్ తొలగించిన చెత్తను తరలించడానికి పంచాయతీకి కేటాయించారు. దాదాపు 12 నుంచి 14 వరకు చెత్త తరలింపు బండ్లు ఉన్నట్టు తెలుస్తుంది. వీటిలో సగానికి పైగా మూలన పడేసినట్లు సమాచారం. ఒక్కొక్క దానికి మరమ్మతులు చేయించాలంటే అధికంగా ఖర్చవుతుంది అని దానికంటే మరికొంత అదనంగా ఖర్చు చేస్తే కొత్తవి కొనవచ్చనే భావనతో కానీ, లేక పంచాయతీలో నిధులు లేక మరమ్మత్తులు చేయించలేక చేతులెత్తేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. దీంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని పని చేయడం లేదు, వాటి కారణాలపై మండల స్థాయి అధికారులు దృష్టి సారించడం లేదనేది నిర్వివాదంశంగా మారినట్లు తెలుస్తుంది. చెత్త సేకరణ తరలింపు వాహనాలు ఎన్ని ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటి అనేది మండల స్థాయి అధికారుల వద్ద లెక్కలు లేనట్లు తెలుస్తుంది. ఇదేనా 17 నాటికి అన్ని గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాల్లో భాగంగా చెత్త తరలింపు వాహనాలు మరమ్మతులు చేయించాలని మండల స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇది సాధ్యం అయ్యే పనేనా.. నిధులు ఎలా సమకూర్చుకోవాలి అనే ప్రశ్నలు తలెత్తినట్లు సమాచారం.
