జగనన్నా నాడు నేడు అంటే ఇదేనా..?
1 min read– పాఠశాలకు రహదారి ఏర్పాటు చేయరా…!
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: జగనన్నా నాడు నేడు అంటే ఇదేనా పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానం రహదారి ఏర్పాటు చేసేది ఎవరు. పంట పొలాల్లో ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే రహదారి అద్వానంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాడు నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతుంది. మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని గ్రామాలలో పాఠశాలలకు రహదారులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని చిత్రేణిపల్లె గ్రామంలో ప్రాథమిక పాఠశాల గ్రామానికి సమీపంలోని పంట పొలాల్లో ఉంది పంట కాలంలో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అలాగే పెద్దకంబలూరు గ్రామం సమీపంలోని పంట పొలాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది అక్కడ కూడా పంట కాలంలో పాఠశాలకు వెళ్లాలంటే రహదారి సక్రమంగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. వర్షాకాలంలో దారి పొడవునా మీరు నిల్వచేరి బురద కుంటలు ఏర్పడడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కింద పడిన సంఘటనలో ఉన్నాయని దీంతో పుస్తకాలు నీటిలో తడిసి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని తల్లిదండ్రులు తెలుపుతున్నారు. నాడు నేడు పథకం కింద పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న అధికారులు ఇప్పటికైనా స్పందించి పాఠశాలలకు సిసి రోడ్డు నిర్మాణాలు చేపడితే విద్యార్థులకు ఇబ్బందులు తొలిగిపోతాయని తల్లిదండ్రులు కోరుతున్నారు.