మీ ఫోన్ పోయిందా.. అయితే ఇలా గుర్తించవచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఫోన్ దొంగతనం జరిగిందంటే ఐఎంఈఐ నెంబర్‌తో పోగొట్టుకున్న ఫోన్‌ను ఈజీగా గుర్తించవచ్చని, పోగొట్టుకున్న ఫోన్‌కు ఐఎంఈఐ నెంబర్ థంబ్ ప్రింట్‌లా ఉపయోగ పడుతుందని హ్యాకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఆ ఐఎంఈఐ నంబర్ అంటే ఏమిటి? ఆ నెంబర్‌ను ఎలా గుర్తించాలి? ఆ నెంబర్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఐఎంఈఐ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటి. ఇది ఒక ప్రత్యేకమైన 15-అంకెల సంఖ్య. ఈ నెంబర్‌తో సాయంతో పోగొట్టుకున్న ఫోన్ ఎక్కడ ఉంది. వారి వివరాల్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. డ్యూయల్ సిమ్ ఫోన్‌ను వినియోగిస్తే. మీకు రెండు ఐఎంఈఐ నెంబర్‌లు ఉంటాయి. ప్రతి సిమ్ స్లాట్‌కు ఒక ఐఎఈఐ నెంబర్ ఉంటుంది. పొరపాటు మీరు మీ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంటే ముందుగా అది రింగ్ అవుతుందో లేదో చెక్ చేయడం. మన అదృష్టం బాగుంటే మీరు ఫోన్ చేసినప్పుడు చేసినప్పుడు అవతల వ్యక్తి మీ ఫోన్ లిఫ్ట్ చేస‍్తే.. మీ ఫోన్‌ను మీరు పొందవచ్చు. మీరు మీ ఐ క్లౌడ్ లేదా గూగుల్ యాక్సెస్ చేయడం ద్వారా మీ డేటాను ఆన్‌లైన్‌లో తొలగించవచ్చు. దొంగతనం జరిగిందని భావిస్తే వీలైనంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌ను కూడా సంప్రదించి, మీ సిమ్ కార్డ్‌ని బ్లాక్ చేయించండి. ఇతరులు మీ నెంబర్‌ను వినియోగించకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా నిలిపివేయమని వారిని అడగండి. మీ ఫోన్‌కి కనెక్ట్ అయిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్స్, జీమెల్స్ పాస్‌వర్డ్‌లను మార్చండి.