మీ ఫోన్ వేడెక్కుతోందా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. అదొక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో కొనేవారి సంఖ్య పెరిగింది. అయితే.. ఇటీవల స్మార్ట్ ఫోన్ల నుంచి మంటలు రావడం.. పేలడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఫోన్లను, బ్యాటరీలను, చార్జర్లను వాడాలో తెలుసుకుందాం.
- ఫోన్ కిందపడి పగిలినా కొంత మంది అలాగే వాడుతారు. పగిలిన ఫోన్ వాడకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పగిలిన చోట నీరు, చెమట లోపలికి పోకుండా … వెంటనే రిపేర్లు చేయించాలి. నీరు, చెమట లోపలికి వెళ్తే.. ఫోన్ బ్యాటరీ తో పాటు, ముఖ్యమైన భాగాలు కూడ పనిచేయకపోవచ్చు. దీంతో ఫోన్ పై ఒత్తిడి పెరిగి మంటలు చెలరేగే అవకాశం ఉంది.
- మొబైల్ కంపెనీలు బ్యాటరీలతో పాటు చార్జింగ్ వైర్లు, అడాప్టర్లు ప్రత్యేకమైన టెక్నాలజీతో తయారు చేస్తున్నాయి. అందువల్ల నకిలీ చార్జర్లు, బ్యాటరీలు ఉపయోగించకపోవడం ఉత్తమం. ఫోన్ తో పాటు వచ్చిన కంపెనీ చార్జర్లు, అడాప్టర్లు వాడటమే మంచిది.
- చాలా మంది ఫోన్ ని వంద శాతం చార్జింగ్ అయ్యే వరకు అలానే ఉంచుతారు. కొన్నిసార్లు రాత్రంతా చార్జింగ్ పెట్టి అలానే ఉంచుతారు. అయితే.. ఫోన్ ని వంద శాతం చార్జింగ్ పెట్టే అవసరం లేదని నిపుణులు అంటున్నారు. 90 శాతం చార్జింగ్ పెడితే చాలంటున్నారు. ఇలా చేస్తే ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక వస్తుందంటున్నారు.
ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిండం వల్ల ఫోన్ బ్యాటరీల సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీలు పేలే అవకాశం కూడ తగ్గుతుందని చెబుతున్నారు.
,