PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇష్క్.. విడుదల పోస్టర్‌‌..

1 min read

సినిమా డెస్క్​ : తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్‌‌ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం ఇష్క్. ఎస్.ఎస్ రాజు డైరెక్టర్‌‌. ఈ చిత్రం థియేటర్ల లో విడుదలకు సిద్దం అయింది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. జూలై 30 వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టర్‌‌లో ‘ఇష్క్’.. ఇది ప్రేమ కథ కాదు అంటూ క్యాప్షన్ జత చేశారు. ఎస్. ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్.వి ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్ కుమార్‌‌లు నిర్మిస్తున్నారు. శ్యామ్ కే. నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

About Author