PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైల్వే రూల్స్​కి విరుద్ధంగా ఆర్డర్లు జారీ.. అవినీతి అధికారులు

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో పనిచేస్తున్న పి. సంతోష్ కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, ఏలూరు, వై చిన్నయ్య, సీనియర్ సెక్షన్ ఇంజినీర్, నూజివీడు మరియు పి. వెంకటేశ్వరరావు, సీనియర్ సెక్షన్ ఇంజినీర్, ఏలూరు అనువారలు ఇంజినీరింగ్ డిపార్టుమెంటు నందు పనిచేయుచున్నారు. వీరు ఇంజినీరింగ్ రూల్స్కు విరుద్ధంగా ట్రాక్మెన్ల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి తప్పుడు ఆర్డర్లు జారీచేస్తున్నారు. ఈ విషయంపై ఈ అధికారులను నిలదియ్యగా సమాచారం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారు. రైల్వే రూల్స్ ప్రకారం ఈ అధికారులు జారీచేసే ప్రతీ ప్రపోజల్ ఆర్డరు కాపీలు యూనియన్ వారికి మరియు అసోసియేషన్ వారికి ఇవ్వవలసి ఉంటుంది. కానీ వీరు యూనియన్కు గాని అసోసియేషన్కు గాని ఏవిధమైన ప్రపోజల్ను గాని, ఆర్డరు కాపీలను గాని ఇవ్వకుండా, డబ్బులు ఎవరు ఇస్తే వారికి దొంగతనంగా మరియు రైల్వే రూల్స్కు విరుద్ధంగా ఆర్డర్లు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు వీరు జారీ చేసిన తప్పుడు ఆర్డర్లు – 1) ఎస్.అప్పారావు, నూజివీడు అనువారికి గ్రేడ్-1 ప్రమోషన్ ఇచ్చి కిమెన్గా నియమించాలి. కానీ రైల్వే రూల్స్కు విరుద్ధంగా ఇతనిని నేరుగా మల్టీపర్పస్ యూనిట్ నకు మేట్ గా నియమించారు. 2) వై. చిన్నయ్య, పి.సంతోష్ కుమ్మక్కై నూజివీడు సెక్షన్ నందు గేట్మెన్ పోస్టులను ప్రొసీజర్ ప్రకారం నియమించకుండా, రూల్స్కు విరుద్ధంగా ఒక్కరాత్రిలో గేట్మెన్ పోస్టులను డబ్బులు ఇచ్చిన వారికి ఆర్డర్లు జారీ చేసినారు.

3) మేడపల్లి శ్రీనివాస్, ట్రాక్మెన్ అనువారు యడ్ల రాజు, ట్రాక్మెన్ అనువారిపై డ్యూటీలో ఉండగా హత్యాప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరచినాడు. ఈ విషయమై అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్, ఏలూరు వారికి మరియు సీనియర్ సెక్షన్ ఇంజినీర్, ఏలూరు వారికి వ్రాతపూర్వకంగా తెలియపరిచినా ఇప్పటివరకు మేడపల్లి శ్రీనివాస్ అను వారిపై డిపార్టుమెంట్ యాక్షన్ తీసుకోలేదు.

4) టి. అప్పారావు, ఏలూరు అనువారు ఇంటివద్ద ప్రమాదవశాత్తు పడిపోయి మోకాలు ఫ్రాక్చర్ అయినది. దీనికిగాను అప్పారావు అనువారు డ్యూటీలో పడిపోయి మోకాలు ఫ్రాక్చర్ అయినట్లుగా, పి. వెంకటేశ్వరరావు గారు మరియు పి.సంతోష్ కుమార్  తప్పుడు రిపోర్టు ఇచ్చినారు. ఈ విషయంపై నేను నిలదియ్యగా 15 రోజుల తర్వాత రిపోర్టు మార్చి ఇచ్చినారు.

5) వి.వెంకట్నాయుడు అనువారు ఇంటి వద్ద పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయితే నైట్ డ్యూటీకి వెళ్ళి, ట్రాక్లో పనిచేయుచుండగా, అతని మోకాలు ఫ్రాక్చర్ అయినది. పి. వెంకటేశ్వరరావు , పి.సంతోష్ కుమార్ గఅతను డ్యూటీలో పడిపోయినట్లుగా తప్పుడు రిపోర్టు ఇచ్చి రైల్వేకు నష్టం కలిగించినారు.

6) ఎ.దుర్గారావు అనువారు కీమెన్ వట్లూరు యూనిట్ నందు కీమెన్ గా పనిచేయుచున్నారు. వీరిని రైల్వే రూల్సుకు విరుద్ధంగా పి. వెంకటేశ్వరరావు గారు మరియు పి.సంతోష్ కుమార్ గారు. పెట్లూరు నుండి ఏలూరు యూనిట్నకు మేట్ గా తప్పుడు ఆర్డరు జారీ చేసి ఏలూరునకు పంపించినారు. ఏలూరు యూనిట్లో ముగ్గురు గ్రేడ్-1లు ఉన్నప్పటికీ వారిని మేట్ గా నియమించకుండా, మరియు ఏలూరు యూనిట్నకు కె. శ్రీనివాసరావు అనువారి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఉన్నప్పటికీ, రూలు. విరుద్ధంగా ఎ.దుర్గారావు అనువారిని ఏలూరునకు ట్రాన్స్ఫర్ చేసినారు.

పైవిధముగా పి.సంతోష్ కుమార్ , పి. వెంకటేశ్వరరావు  మరియు వై చిన్నయ్య. ట్రాక్మెన్స్ వద్ద నుండి లంచాలు వసూలు చేసి రైల్వే రూల్స్కు విరుద్ధంగా తప్పుడు ఆర్డర్లు జారీచేస్తూ, భారతీయ రైల్వే రాబడికి నష్టం కలిగిస్తూ, అధికార దుర్వినియోగం చేస్తున్న ఈ అధికారుల ఆగదాలను అరికట్టడానికి ప మీడియా వారి సహకారం కోరుతున్నానని పి.వికర బాబు తెలిపారు.

About Author