NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విఏఏ లకు షోకాజ్ నోటీసులు జారీ:ఏఓ

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురికి గ్రామ వ్యవసాయ సహాయకులు(విఏఏ) కడుమూరు-శృతి,మాసపేట-హుస్సేన్ భాష,పీరు సాహెబ్ పేట-చంద్రకళ, చింతలపల్లి-శ్రీలత, జలకనూరు-ప్రత్యూష వీరికి నందికొట్కూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సి.విజయ శేఖర్ ఆదేశాల మేరకు  షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు మిడుతూరు మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ లోపు గ్రామాల్లో రైతులు వేసిన పంటలను ఈ క్రాప్ పంట నమోదును పూర్తి చేయాలని అందుకు గాను వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎవ్వరికీ కూడా సెలవులు మంజూరు చేయడానికి వీలు లేదని అంతే కాకుండా సెలవు దినాల్లో కూడా గ్రామాల్లో విఏఏలు ఫీల్డ్ కి వెళ్లి రైతుల పంట నమోదును పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు.బుధవారం రోజున శ్రీ కృష్ణాష్టమి  పండుగ సెలవు రోజు అయినప్పటికీ ఏఓ పీరు నాయక్ మండలంలోని అన్ని గ్రామాలలో తిరుగుతూ పంట నమోదును పరిశీలించారు.విఏఏలు ఫీల్డ్ లో ఉండాలని చెప్పినా కూడా 5 మంది ఫీల్డ్ లో లేనందున వారికి షోకాజ్  నోటీసులు జారీ చేసినట్లు ఏఓ తెలిపారు.గ్రామ వ్యవసాయ సహాయకులకు అప్పజెప్పిన బాధ్యతలను గ్రామాల్లో ఉన్న ప్రతి రైతుకు పంట నమోదును  పూర్తి చేయాల్సిందేనని రైతుల నుండి ఒక్కరు కూడా పంట నమోదు కాలేదని నా దృష్టికి రాకూడదని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని విఏఏ లను ఆయన హెచ్చరించారు.

About Author