ఎస్సి, ఎస్టీ,బిసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాల ఇవ్వండి
1 min read
పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: కంకిపాడులో ‘జగనన్నకు చెబుదాం’లో కృష్ణాజిల్లా కలెక్టర్ ,కి పెనమలూరు శాసనసభ్యునికి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్రాష్ట్రంలోని షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనకబడిన కులాలకు చెందినవారికి, శాశ్వత కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా॥ కె.ఎస్.జవహర్ రెడ్డి , 2023 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన. జారీచేసిన ఉత్తర్వులు అమలుకొరకు జిల్లాలోని తహశీల్దార్లు, ఆర్.డి.ఓ.లు గ్రామసచివాలయాల అడ్మిన్లు, తగు చర్యలు తీసుకోగలందులకు,కంకిపాడు లో శుక్రవారం నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజబాబు కి, పెనమలూరు శాసనసభ్యులు కె. పార్థసారధి కి జంపాన శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రాన్ని అందించారు. ఈ అంశం సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను,ప్రజాప్రతినిదులనుఆయనకోరారని,. సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.