– జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : దివ్యాంగులు పెన్షన్ పొందాలంటే శాశ్వత ధ్రువపత్రం అవసరమన్నారు జాయింట్ కలెక్టర్( ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు. దివ్యాంగులను పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పించుకోకుండా… వెంటనే వారికి శాశ్విత ధ్రువపత్రాలు జారీ చేయాలని సదరం సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్(ఆసరా&సంక్షేమం) ఎం వి కె శ్రీనివాసులు ప్రభుత్వ సర్వ జన వైద్యాశాలలోని ఒపి నెంబర్ 41విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వయోవృద్ద్ధులకు వినికిడి పరీక్షలు, హిజ్రాల కు ధ్రువీకరణ పత్రాలు జారీ విధానాన్ని పరిశీలించారు.
అనంతరం హిజ్రాలకు జేసీ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను పంపిణి చేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.విజయ డిప్యూటీ సూపరింటెండెంట్ డా.భగవాన్, ఈ యన్ టి ప్రొఫెసర్ డా.ఫజుల్ రెహ్మాన్ ఖాన్, యురాలజీ ప్రొఫెసర్ డా.సీత రామయ్య, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.విజయమోహన రెడ్డి, మానసిక వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఇక్రమూల్లా తదితరులు పాల్గొన్నారు.