NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సోనూసూద్ పై ఉధృతంగా ఐటీ దాడులు !

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: ప్రముఖ న‌టుడు సోనూసూద్ పై ఐటీ దాడులు కొన‌సాగుతున్నాయి. ముంబ‌యిలోని ఆయ‌న నివాసాలు, కార్యాల‌యాల‌పై ఏక‌కాలంలో దాడుల నిర్వహించిన‌ట్టు ఐటీ వ‌ర్గాలు తెలిపాయి. వ‌రుస‌గా మూడో రోజు కూడ సోనూసూద్ నివాసాల పై ఐటీ దాడులు జ‌రిగాయి. రియ‌ల్ ఎస్టేట్ కు చెందిన ఒక ఒప్పందం, మ‌రికొన్ని ఆర్థిక వివ‌రాల పై ఐటీ దృష్టిసారించిన‌ట్టు తెలుస్తోంది. క‌రోన స‌మ‌యంలో ఎంతో మంది పేద‌ల్ని స్వగ్రామాలకు త‌రలించి సోనూసూద్ ప్రజ‌ల హృద‌యాలు గెలుచుకున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ ప్రభుత్వం సోనూసూద్ ను దేశ్ కా మెంటార్ గా నియ‌మించింది. ఈ నేప‌థ్యంలో ఐటీ దాడులు నిర్వహించ‌డం స‌ర్వత్ర చ‌ర్చనీయాంశంగా మారింది. ప‌లు రాజ‌కీయ విమ‌ర్శల‌కు కూడ ఈ దాడులు కార‌ణ‌మ‌వుతున్నాయి.

About Author