NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ర‌మ్య‌ర‌ఘుప‌తితో సంబంధం లేదు.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ న‌టుడు వీకే. న‌రేశ్ పేరు చెప్పి డ‌బ్బు వ‌సూలు చేస్తుంద‌న్న నెపంతో ఆయ‌న మాజీ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి పై కేసు న‌మోదైంది. ఈ విష‌యం పై వీకే. న‌రేశ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ‘రమ్య రఘుపతి గారి ఇష్యూ(ఫైనాన్షియల్‌ ఇష్యూ) బయట పడినప్పటి నుంచి నాకు మీడియా, బంధుమిత్రుల నుంచి విపరితమైన ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం మాకు పెళ్లైయింది. మనస్పర్థల కారణంగా రెండూ, మూడేళ్లకే విడిపోయాం. ఇలాంటివి జరుగుతాయనే భయంతోనే ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అనంతపురం, హిందూపురం ఇష్యూ తర్వాత ఇలాంటివి భవిష్యత్తులో వస్తాయానే ఉద్దేశంతోనే 2, 3 నెలల క్రితమే ఓ ప్రకటన ఇచ్చాను. తనతో నాకు గాని, నా కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని, ఆర్థికంగా కూడా. ఈ సమస్య ఎంత దూరం వెళుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో అందరూ భయంతో ఉన్నారు. డబ్బు తీసుకోవడం, మోసం చేయడం వంటివి ఇంతవరకు మా కుటుంబాల్లో ఎక్కడ లేదు. నేను చెప్పేదే ఒక్కటే రమ్య రఘపతి కేసులో నాకు, నా కుటుంబ సభ్యుల ప్రమేయం ఏం లేదు’ అంటూ వివరణ ఇచ్చారు.

                                     

About Author