అక్కడ ` Z` గుర్తు వాడితే నేరం !
1 min read
పల్లెవెలుగువెబ్ : జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ అవసరాల కోసం ఎవరైనా z
గుర్తు వాడితే విచారణ ఎదుర్కోవలసి ఉంటుందని ప్రకటించింది. రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమణ సమయంలో వాహనాల పై z
గుర్తును వాడుతున్నాయి. ఈ నేపథ్యంలో జెడ్
గుర్తును వాడితే రష్యా ఆక్రమణకు మద్దతు ఇచ్చినట్టేనని జర్మనీ అధికార వర్గాలు ప్రకటించాయి. రష్యా .. ఉక్రెయిన్ ను ఆక్రమించడం ఎంత నేరమో… రష్యా చర్యకు మద్దతు తెలపడం కూడ అంతే నేరమని జర్మనీ ప్రకటించింది. జర్మనీలో 16 రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం చేశారు.