NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వకారణం

1 min read

– జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆంజనేయులు గారిని దుస్సాలువ ఘజమాలతో  సత్కరించిన మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: రాయచోటి పట్టణం మాసాపేట ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఆంజనేయులుకి జాతీయ ఉత్తమ  ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వకారణం,హర్షణీయమని మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు  బుధవారం సాయంత్రం అవార్డు  గ్రహీత ఆంజనేయులు   నివాసానికి  వెళ్లి ఆంజనేయులు  దంపతులకు ఘజమాల వేసి దుస్సాలువతో సత్కరించినారు.ఈ సందర్భంగా ప్రసాద్ బాబు  మాట్లాడుతూ 32 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఆంజనేయులు  విన్నూత్న రీతిలో విద్యాబోధన, ఆహ్లదకర వాతావరణంలో  పాఠాలు నేర్పించడం,సొంత డబ్బులు వ్యయం చేసి పాఠశాలలో ల్యాబ్ ఏర్పాటు చేసి విద్యార్థులు కు పాఠాలను బోధించడం,మట్టితో పర్యావరణ అనుకూల వస్తువులును విద్యార్థుల చేత చేయించడం  అభినందనీయం, ఆదర్శ నీయమన్నారు. రాయచోటిని విద్యారంగంలో తీర్చిదిద్దడానికి ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయుల సూచనలు, సలహాలు ఎంతో అవసరమన్నారు.ఇదే స్ఫూర్తితో విద్యార్థులుకు విద్యార్థులును ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ప్రసాద్ బాబు   కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుబ్బయ్య నాయుడు,రాజేంద్ర నాయుడు,లాయర్ సతీష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author