వైవియు లో వేమన విగ్రహం తొలగించడం సిగ్గుచేటు
1 min read-ఐటిడిపి ఛాంపియన్ యామాల మణికంఠ
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: యోగి వేమన యూనివర్సిటీలో గల వేమన విగ్రహం తొలగించడం సిగ్గుచేటని మండల ఐ టి డి పి చాంపియన్ యామల మణికంఠ అన్నారు. గురువారం ఆయన చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాకవి యోగి వేమన విగ్రహాన్ని యోగి వేమన యూనివర్సిటీ నందు వైయస్సార్సీపి ప్రభుత్వ౦ తొలగించడం ఎంతవరకు ఎంతవరకు సబబు అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ఎందరో గొప్ప గొప్ప మహనీయులను మనం స్మరించుకోవడం పోనిచ్చి అలాంటిది ఉన్న విగ్రహాలను తొలగించడం, మన కవులకు, మన గొప్ప గొప్ప నాయకులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన మండిపడ్డారు, ప్రజలు దయతలచి అధికారమిస్తే దాని విలువ తెలియకుండా గొప్ప వాళ్ళను అవమానిస్తూ అవహేళన చేస్తూ అహంకారం ప్రదర్శిస్తున్నారు అన్నారు ,లేకపోతే వేమన వర్సిటీలో వేమన విగ్రహాన్నే తొలగించడం ఏంటి, వైయస్సార్సీపి ప్రభుత్వం అవలంబిస్తున్న ఇలాంటి పోకడలపై రాష్ట్రంలో సభ్య సమాజం చీదరించుకునేలా పాలన సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు, ఇలాంటి నీచమైనటువంటి పనులు చేస్తూ తలదించుకునేలా వైయస్సార్సీపి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆయన దుయ్యబట్టారు.