ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి
1 min read– వేదవ్యాస్ -రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉందో మీకు తెలుసు -వైసీపీ ఓటుకు 5వేలు ఇవ్వడం ఖాయం:గౌరు -మిడుతూరు పాఠశాలల్లో ఎమ్మెల్సీ ప్రచారం చేపట్టిన:ఎన్నికల పరిశీలకులు వేదవ్యాస్,గౌరు వెంకటరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తాయోనని తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏవిధంగా ఉందో మీకు తెలుసునని కృష్ణాజిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే,మాజీ డిప్యూటీ స్పీకర్,టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఎన్నికల పరిశీలకులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న పాఠశాలల్లో నంద్యాల పార్లమెంట్ టిడిపి జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏపీ మోడల్ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులతో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బరిలో నిలిచారని అత్యధిక మెజారిటీతో మొదటి ఓటు వేసి గెలిపించాలని వేదవ్యాస్ ఉపాధ్యాయులను కోరారు.ఈసందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పరిపాలన ఏవిధంగా ఉందో మీకు అందరికీ తెలుసని ఉద్యోగులు,నిరుద్యోగులు,ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓటుకు ఐదు వేల చొప్పున డబ్బు ఇచ్చి వైసీపీ వారు మభ్యపెడతారని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టిడిపి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభివృద్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ఉపాధ్యాయులను కోరారు.మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా అయితే సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొంటూ ఉందని నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.తదనంతరం టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి స్వగృహంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.ఎన్నికల పరిశీలకులు వేదవ్యాస్ కు శాలువా మరియు పూలమాలలతో కాత రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో టిడిపి మండల నాయకులు గుండం రమణారెడ్డి,నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,నాగలూటి సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి,మహేష్ నాయుడు,సుభాన్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివజ్యోతి,ప్రిన్సిపాల్ శంకర్ నాయక్,సలీం భాష మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.