నీటిని సంరక్షించుకోవడం మనందరి బాధ్యత
1 min read
రీజినల్ కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ – పి.వి కిషోర్ రెడ్డి.
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి గారి ఆదేశాల మేరకు ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ.క్యాంప్ మాంటిసోరి హైస్కూల్లో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించడం పై అవగాహన కార్యక్రమం మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పివి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచే దిశగా వర్షపు నీటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు .లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి ,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు పారా లీగల్ వాలంటీర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యర్థజలాలను శుద్ధి చేసి తిరిగి వ్యవసాయ అవసరాలకు ఉపయోగించడం పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2025 ప్రపంచ జల దినోత్సవం థీమ్ మంచు పర్వతాల సంరక్షణ మన అందరి బాధ్యత అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా జల సంరక్షణకై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాజేంద్ర మాట్లాడుతూ చెరువులు, కుంటల పునరుద్ధరణ భూగర్భ జలాలను పెంచేందుకు కీలకమవుతుందన్నారు .అశోక కాలేజ్ డీన్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రేపటి నీటి అవసరాల కోసం నేటి నీటి సంరక్షణ ధ్యేయంగా మనమందరం బాధ్యతాయుతంగా ఉండాలన్నారు .పర్యావరణ సంరక్షణ విభాగ అధ్యక్షులు తోట హరికృష్ణ మాట్లాడుతూ నీటి పొదుపు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్ , తదితరులు పాల్గొన్నారు.అనంతరం వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు.
