వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు తో అధికారంలోకి రావడం పక్కా
1 min readమంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న
పల్లెవెలుగు, మంత్రాలయం: వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు తో అధికారంలోకి రావడం పక్క అని మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రాలయం నియోజకవర్గం లో పెద్దకడుబూరు మండలం కంబలదిన్నె, చిన్న రంగాపురం, తారాపురం గ్రామాల్లో జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ని బలోపేతం చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం లో టీడీపీ జనసేన పార్టీ కలిసి అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. వైకాపా పని అయిపోయిందని వచ్చేది టిడిపి జనసేన ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామాంజి ,శ్రీనివాసులు,మహదేవ, అంజి రెడ్డి, గోపాల్, రాజశేఖర్, అశోక్, ప్రభుదాస్, మహేష్, ప్రకాష్, బజారి తదితరులు పాల్గొన్నారు.