అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరచడం అభినందనీయం
1 min read– రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇటీవల ఢిల్లీలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ యూత్ లీడర్ షిప్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో కర్నూల్ నగరానికి చెందిన టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రాలు సాధించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ యూత్ లీడర్ షిప్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన 15 మంది చిన్నారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టిజివీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ భార్గవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నృత్య శిక్షకుడైన డాక్టర్ భార్గవ్ కుమార్ కర్నూల్ కు చెందిన చిన్నారులకు అన్ని రకాల డాన్స్ విభాగాల్లో మెరుగైన శిక్షణ ఇచ్చి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించడం అభినందనీయమని చెప్పారు. తద్వారా కర్నూలు పేరును జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో నిలిపారని ప్రశంసించారు .ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో టిజివీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీకు చెందిన చిన్నారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి క్రమశిక్షణతో కర్నూలు గౌరవాన్ని నిలిపారని ప్రశంసించారుమ చిన్నారులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా డాక్టర్ భార్గవ్ కుమార్ వారిని నృత్య రంగంలో అగ్రస్థానంలో నిలపడం అభినందనీయమని చెప్పారు. అనంతరం టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ భార్గవ్ కుమార్ మాట్లాడుతూ టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయడంలో తమకు సంపూర్ణ సహకారం అందించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన అందిస్తున్న సహకారంతో కర్నూలుకు చెందిన చిన్నారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నృత్య ప్రదర్శనలు ఇచ్చేలా ఏర్పాటు చేసి కర్నూలు ఖ్యాతిని మరింత చేస్తానని అన్నారు .తమకు సహకారం అందిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు ధన్యవాదాలు తెలిపారు.