సమాజాన్ని పురోగమింపచేసేది ధర్మమే
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.
ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: సమాజంలో ఐకమత్యంతోపాటు అనురాగాన్ని, ఆత్మీయతలను పాదుకొల్పేది ఆధ్యాత్మికత మాత్రమేనని, అటువంటి ఆధ్యాత్మికతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండలం, అల్వాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం మహాభారతం భగవద్గీతలపై ధర్మ ప్రచారకులు డమాం జగదీశ్ చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రెడ్డిగారి వెంకట్రామిరెడ్డి, తిమ్మాపురం మురహర రెడ్డి, యు. సోమన్న, టైలర్ సోమన్న, కర్రెన్న, సి. నారాయణ, బోయ వెంకటేశ్వర్లు, కె. నారాయణరెడ్డి, జగదీష్, బి.జయరాముడు, బి.సోమిరెడ్డి, కౌలుట్ల, తులసి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.