క్రీస్తును నమ్ముకోవడం నిషేధం
1 min readపల్లెవెలుగువెబ్ : మతపరమైన కార్యకలాపాల పై చైనా తీవ్రస్థాయిలో నిబంధనలు కఠినతరం చేసింది. ఆన్ లైన్ లో విదేశీయుల మతపరమైన కంటెంట్ వ్యాప్తిని నిషేధించింది. జాతీయ భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. జిన్హువా కథనం ప్రకారం.. విదేశీయులు మతపరమైన కార్యకలాపాలు నిర్వహించడం, ప్రత్యక్ష ప్రసారాలు చేయడం నేరం కింద పరిగణిస్తారు. బుద్ధుడిని ఆరాధించడం, ధూపం వేయడం, జపం చేయడం నిషేధం. క్రైస్తవులుగా మతం మార్చుకోడానికి బాప్టిజం తీసుకోవడాన్ని కూడా అనుమతించరు. మతం పేరుతో నిధులు సేకరించడానికి.. ఏ సంస్థా లేదా వక్తికీ అనుమతి ఉండదు.