NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనసేన ప్రభంజనం సృష్టించడం కాయం

1 min read

గుడిపాడు ప్రభాకర్ ను అభినందించిన పవన్ కళ్యాణ్

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: జనసేన మరియు టిడిపి పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయమని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.శనివారం విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన విధానాలపై యువతతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి యువతను అక్కడికి ఆహ్వానించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని గుడిపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ వీరాభిమాని ప్రభాకర్ ను కార్యక్రమానికి ఆహ్వానించారు.పవన్ కళ్యాణ్ తో నేరుగా మాట్లాడటానికి ప్రభాకర్ కు దక్కడం విశేషం. గతంలో ప్రభాకర్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ శ్రీశైలం మరియు తిరుపతికి కాలినడకన పాదయాత్ర చేయడం హర్షించదగ్గ విషయమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభాకర్ ను అభినందించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ యువత కృషి చేయాలని మనం అధికారంలోకి వస్తే యువతకే పెద్ద పీట వేస్తామని వారికే ప్రాధాన్యత ఇస్తూ మీకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యువతతో అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా పార్టీ నాయకులు యువతీ యువకులు పాల్గొన్నారు.

About Author