ప్రజా సమస్యలు తీర్చే బాధ్యత నాది.. టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత తాను తీసుకుంటానని కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 43 వ వార్డులో ఆయన వార్డు పర్యటన చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు టీజీ భరత్ తో సమస్యలు మొరపెట్టుకున్నారు. రోడ్లు సరిగా లేవని, డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదని, పెన్షన్లు అందడం లేదని, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఉద్యోగాలు లేవని టీజీ భరత్ కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందకపోవడం చాలా దారుణం అన్నారు. ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చకపోవడం బాధాకరమని టిజి భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల బాధలు అర్థం చేసుకోవాలన్నారు. లేదంటే ప్రజలే తీర్పు చెబుతారన్నారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే కర్నూలు ప్రజల సమస్యలు తీరుస్తానన్నారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అన్ని వార్డుల్లో పింఛన్ల సమస్యలు ఉన్నాయని వీటిపై వినతిపత్రం తయారుచేసి జిల్లా కలెక్టర్ ను కలిసి తెలియజేస్తామని భరత్ చెప్పారు. అర్హులందరికి పింఛన్లు, ఇల్లు అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు టిజి భరత్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి రాజశేఖర్, నేతలు యేసు, చంద్ర, హనుమంత రావు చౌదరి, నాగేశ్వరరావు, నారాయణ చౌదరి, వెంకటేష్, రాము, అశోక్, భాస్కర్, నరేష్, రవి, వినోద్ చౌదరి, శ్రీధర్, బాలయ్య, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.