NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హిందూసనతన ధర్మం చిన్నప్పుడే నేర్పడం అవసరం…

1 min read

విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మీడియా కన్వీనర్

మాళిగి భానుప్రకాష్ …..

కర్నూలు, న్యూస్​ నేడు:  విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా,శ్రీ అభయాంజనేయ స్వామి ప్రఖండలోని హరిశ్చంద్ర శరీన్ నగర్, శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయంలో గత ఆరు రోజులుగా” విజ్ఞాన వికాస్ బాల సంస్కార కేంద్రం ”  ఆధ్వర్యంలో జరుగుతున్న ” బాబాలికల వేసవి శిక్షణా శిబిరం ” ముగింపు సభకు ముఖ్య అతిథి గా విచ్చేసినన విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర మీడియా కన్వీనర్ మాళిగి భాను ప్రకాష్ మాట్లాడుతూ…. మొక్కై వంగనిది మానై వంగదన్న నానుడిని అనుసరించి చిన్నప్పుడే సనాతన హైందవ ధర్మం లోని సంస్కృతి, సంప్రదాయం, దేశభక్తి, దైవభక్తి, సామాజిక సమరసత వంటి సుగుణాలను అలవాటు చేయడానికి చిన్నప్పుడే  బీజం పడాలని, తద్వారా రేపు పిల్లలంతా పెద్దవారై, దేశం కోసం ధర్మం కోసం పనిచేసేలా వారిని సంఘటితం చేయడానికి ఇటువంటి బాలబాలికల వేసవి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని తెలియజేశారు.అంతకు ముందు ఉదయం 11:00 గం.లకు విజ్ఞాన వికాస్ బాల సంస్కార కేంద్రం పిల్లలు జైశ్రీరామ్…జై జై శ్రీరామ్ అంటూ శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం ఇరువైపులా ఉన్న వీధులగుండా వారే తయారు చేసుకున్న చిన్న పల్లకీలో భగవాన్ “రామ్ లల్లా ” చిన్న విగ్రహాన్ని ఊరేగించారు.11:30 విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు గారి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన బాలబాలికల వేసవి శిక్షణా శిబిర సభలో మాట్లాడుతూ జిల్లా మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి పావని అక్కయ్య గత 17 సం.లుగా ఇక్కడ ఉన్న పిల్లలకు ప్రతి ఆదివారం ఉ 9:30 గం లో నుండీ 11:00 గం.ల వరకు విజ్ఞాన వికాస్ బాల సంస్కార కేంద్రం పేరుతో పిల్లలకు హిందూ దేవీ,దేవతల శ్లోకాలు,నిత్య సాధన శ్లోకాలు,సుభాషితాలు,తెలుగు పద్యాలు, నీతి కథలు,దేశభక్తి గీతాల వంటివి నేర్పిస్తూ వీశేషంగా గత నెల 29/4/25 వతెదీ నుండి నిన్నటి 4/05/25 వరకు ప్రతి రోజు పిల్లకు శిక్షణను ఇచ్చి వారిచే ఈ రోజు ప్రదర్శన చేయించడం చాలా ఆనందం దాయకమని అన్నారు, శ్రీ విశ్వ హిందూ పరిషత్ (వెంకటరమణ కాలని పరిధి) వేంకటేశ్వర స్వామి ప్రఖంఢ కార్యదర్శి కరణం సుధాకర్ మాట్లాడుతూ ఇంత మంది పిల్లలు చక్కగా శ్లోకాలు,పాటలు,పద్యాలు పాడుతుంటే తనకు తాన చిన్నతనం గుర్తుకు వస్తున్నదని, తాము 1 వ పట్టణ పోలీసుస్టేషన్ దగ్గర మెయిన్ బజార్ లో ఉన్న రామాలయం లో మాళిగి నారాయణా చార్యులు,మాళిగి వ్యాసరాజ్ గార్ల ఆధ్వర్యంలో బాల సంస్కార కేంద్రంలో శిక్షణ పొందామని, అప్పుడు నేర్చుకున్నవి ఇప్పటికీ మర్చిపోలేదని చిన్నప్పుడు నేర్చుకున్నందుకే తమకు అవన్నీ ఇంకా గుర్తున్నాయని చెప్పి తెలియజేశారు. అనంతరం పిల్లలందరికీ విచ్ఛేసిన అతిథుల చేతులు మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి మాలికి పావని నిర్వహించారు, ప్రసాద వితరణ తో కార్యక్రమం సమాప్తమైంది.ఈ కార్యక్రమంలో శ్రవణ్,సహస్ర,60 మంది బాలబాలికలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *