ఎస్సీ కమిషన్ చైర్మన్ ను విమర్శించడం తగదు..
1 min readపల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాదు ను విమర్శించడం తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి జవహర్ కు తగదని చరిత్ర గురించి తెలుసుకుని మాట్లాడాలని మాలమహానాడు నందికొట్కూరు తాలూకా అధ్యక్షుడు నాగేష్ అన్నారు.శుక్రవారం పట్టణంలోని మాలమహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీని ఒక వర్గానికి అంటగట్టలేదని విక్టర్ ప్రసాద్ వాస్తవ చరిత్ర గురించి చెప్పారని అన్నారు. రాజ్యాంగ సృష్టి కర్త బాబా సాహెబ్ అంబేద్కర్ వలనే మీరు తెలుగుదేశం ప్రభుత్వం లో మంత్రి పదవి అనుభవించారని ఆనాడు గాంధీ చెప్పినట్టు కేవలం ఒక వర్గానికే ఓటు హక్కు కల్పించి ఉంటే మీరు ఇలా మాట్లాడేవారు కాదని వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. చరిత్రలోని వాస్తవాలను విక్టర్ ప్రసాద్ ప్రస్తావించారని ఎవరి మీద విమర్శలు చేయలేదన్నారు. వాస్తవాలను ప్రస్తుత సమాజానికి తెలిపారన్నారు. డా. బి ఆర్ అంబేద్కర్ ను ఓకే వర్గానికి అంటగట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విక్టర్ ప్రసాద్ జాతి కోసం చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే ఆయనపైన విమర్శలు చేస్తున్నారన్నారు. విక్టర్ ప్రసాద్ ను పదవి నుండి తొలగిస్తే మరో విక్టర్ ప్రసాద్ మాత్రమే పదవి లోకి వస్తారు కానీ జవాహర్ రారని, విక్టర్ ప్రసాద్ ఒక వ్యక్తి కాదని ఒక దళిత శక్తి అని అన్నారు.ఆయన పై విమర్శలు చేయడం మానుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు మాలమహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు.