PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గతంలో మాదిరే విధులు నిర్వహిస్తామంటే కుదరదు

1 min read

– ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేకపోతే షోకాజ్ నోటీసులు -ప్రతి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో గృహ నిర్మాణాల పురోగతిపై ఎంపిడిఓ జిఎన్ఎస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించే అధికారులపై ఎంపీడీవో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇండ్ల నిర్మాణాల్లో పురగతి చూపాలంటూ మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు. గతంలో మాదిరే విధులు నిర్వహిస్తామంటే కుదరదు.ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి చూపకపోతే మీకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాది రోజున ఇండ్లు ప్రారంభించాలని ఆలోపు వివిధ గ్రామాలలో వివిధ దశలలో ఉన్న ఇండ్లు పూర్తి చేయాలంటూ నంద్యాల జిల్లా కలెక్టర్ చాలా సీరియస్ గా తీసుకున్నారని మంగళవారం రోజు కలెక్టర్ తో జరిగిన సమావేశంలో మీరు చేసే తప్పిదాల వల్ల కలెక్టర్ తో మేము తిట్లు తినాల్సి వచ్చిందని అన్నారు.ఇళ్ల నిర్మాణాల్లో సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు తప్ప మిగిలిన వారందరూ కూడా పంచాయతీ కార్యదర్శులు,వీఆర్వోలు,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,వెల్ఫేర్ అసిస్టెంట్లు,మహిళా పోలీసులు మీరంతా కూడా వీటిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందేనని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారిని ఒప్పించే బాధ్యత మీదేనని విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్క లబ్ధిదారుడి దగ్గరికి వెళ్లి మీరు క్షేత్ర స్థాయిలో వారితో మాట్లాడి ఒప్పిస్తూ నిర్మాణాల్లో వేగం పెంచకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.అంతేకాకుండా మండలంలో తిమ్మాపురం,మిడుతూరు1,మిడుతూరు 2,చౌటుకూరు, జలకనూరు గ్రామాలు వెనుకబడి ఉన్నాయని అన్నారు.గ్రామాల వారీగా ఇండ్లు ఏఏ దశలలో ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అడిగారు.అవసరమైతే పొదుపు సంఘాల నుండి రుణాలు వారికి ఇవ్వాలన్నారు.సచివాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా రాను,పోను సమయపాలన పాటిస్తూ బయోమెట్రిక్ వేయాలని,ఎప్పుడు పడితే అప్పుడు విధులకు వస్తే సహించే ప్రసక్తి లేదని అన్నారు.గ్రామాల్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను త్వరగా పూర్తి చేయాలని ఏఎన్ఎం లకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో ఈఓఆర్డి ఫక్రుద్దీన్,డిప్యూటీ తహసిల్దార్ రవణమ్మ,ఏవో దశరథరామయ్య,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్, ట్రాన్స్కో ఏఈ క్రాంతి కుమార్,హౌసింగ్ ఇన్చార్జి ఏఈ రమేష్,ఏపీవో జయంతి,ఏపిఎం సుబ్బయ్య, సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి,పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,వెలుగు సీసీలు,ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

About Author