PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుల వివ‌క్ష లేద‌న‌డం స‌రికాదు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స‌మాజంలో కుల‌వివ‌క్ష చాలా ఎక్కువ‌గా ఉంద‌ని, దాని గురించి మాట్లాడే ప్రయ‌త్నం చేయం.. స్పందించే ప్రయ‌త్నం చేయం అని అన్నారు ప్రముఖ ద‌ర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఆయ‌న ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ల‌వ్ స్టోరీ. నాగ‌చైత‌న్య, సాయి ప‌ల్లవి జంట‌గా న‌టించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల మీడియాతో మాట్లాడారు. స‌మాజంలో ఉన్న కుల‌వివ‌క్షను, స్త్రీ ప‌ట్ల ఉండే వివ‌క్ష ను సినిమాలో చూపే ప్రయ‌త్నం చేశామ‌ని తెలిపారు. ప్రస్తుత స‌మాజంలో ఎన్నో స‌మ‌స్యలు ఉన్నాయ‌ని, వాటిని సినిమాలు , మీడియా ద్వార చూపే ప్రయ‌త్నం చేయాల‌ని ఆయ‌న అన్నారు. కుల స‌మ‌స్యను సినిమాలో సంపూర్ణంగా చూపించాన‌ని చెప్పలేనని, కానీ సాధ్యమైనంత వ‌ర‌కు స‌మ‌స్యను ప్రతిబింబించే ప్రయ‌త్నం చేశాన‌ని అన్నారు.

About Author