స్కూల్ అసిస్టెంట్లను ప్రైమరీ స్కూల్ కు పంపడం సరికాదు.. ఆపస్
1 min read
మదనపల్లి న్యూస్ నేడు : పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన జీవో 19 లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా కన్వర్షన్ చేయడం జరిగిందని, స్కూల్ అసిస్టెంట్లకు పై స్థాయి ప్రమోషన్లు ఇవ్వాలి కానీ ఈ రకంగా డీమోషన్ కల్పించడం ఏమాత్రం సరి కాదని, ఈ నిర్ణయం ఉపసంహరించుకుని సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగిస్తూ, విద్యార్థుల సంఖ్య 45 దాటితే రెండవ సెక్షన్ గా పరిగణించి ఆ తర్వాత ప్రతి 30 మందికి మరొక సెక్షన్ కేటాయిస్తూమిగులు స్కూల్ అసిస్టెంట్లను హైస్కూల్స్, యూపీ స్కూల్స్ కు మాత్రమే కేటాయించాలని, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా ఎస్ జి టి లకు పిఎస్ హెచ్ఎం లు గా ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు శవన్న గారి బాలాజీ డిమాండ్ చేశారు.మదనపల్లె నందు స్థానిక ఆపస్ కార్యాలయంలో ఆపస్ జిల్లా అధ్యక్షులు శ్రీ నరసింహులు గారి అధ్యక్షతన అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు, రిఅపోర్షన్ సీనియార్టీ లిస్టులు, వెబ్ కౌన్సిలింగ్ తదితర విషయాలపై ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ మాట్లాడుతూ 19 జీవోలో తొమ్మిది రకాల పాఠశాలలు చూపడం జరిగిందని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను కేటాయించడం అసంబద్ధంగా ఉందని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరూ ఉపాధ్యాయులు ఉండే విధంగా, ప్రతి 20 మందికి ఒక ఎస్జీటీను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారుజిల్లా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తగినంత స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నూతనంగా విడుదల చేసిన లీప్ యాప్ లోనే బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం వెబ్ ఆప్షన్లు ఇవ్వడం అవకాశం కల్పించాలన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలకు ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించి అన్ని కేడర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 253 జీవోను రద్దు చేసి టీచర్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రేషనలైజేషన్ పాయింట్లు కేటాయింపులో రెండుసార్లు వరుసగా రేషనలైజేషన్ కి గురైన టీచర్లకు, ప్రమోషన్ పై వెళ్లి ప్రస్తుతం రేషన్లైజేషన్ అవుతున్న టీచర్లకు ప్రత్యేకంగా ఆదరణ పాయింట్లు కేటాయించాలని కోరారు. ఎస్ జి టి లకు మ్యానువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారుఈ కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర మీడియా ఇంచార్జ్ రెడ్డి రాజేశ్వరి,జిల్లా కార్యదర్శి రెడ్డి శేఖర్,నాయకులు సిద్ధారెడ్డి, రమణ, కొండారెడ్డి, గిరీష్, గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.