నాపై అసత్య ప్రచారం చేయడం సరికాదు.. మాజీ మంత్రి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు లోని ఓ భూ వివాదంలో తనపై అసత్య ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి మారెప్ప మీడియా సమావేశంలో తెలిపారు. కర్నూలు లోని 45వ వార్డు కు చెందిన సర్వే నెంబర్ 781/ఎ1 లో 67 సెంట్ల స్థలానికి సంబంధించి ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకులు సోమసుందర్ కు ఎస్.వీ. ఎస్ ప్రసాద్ మధ్య వివాదం ఉందని ఈవిషయంలో తాను మాట్లాడకున్నా సేపూరి విజయ్ మోహన్ ను అరెస్టు చేయాలని అన్నట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టవ్యతిరేకమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి దుష్ప్రచారం చేయడం వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకోవాలని లేని పక్షంలో చట్టపరంగా పోరాటం చేయాలన్నారు. ఈసందర్భంగా న్యాయవాది సేపూరి విజయ్ మోహన్ మాట్లాడుతూ తనను కేసు నుంచి తప్పుకోవాలని సోమసుందర్ బెదిరింపులకు గురిచేస్తున్నారని 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఈ విషయంలో రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్.వీ.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ఈ స్థలం విషయంలో సోమసుందర్ తన వద్ద రెండు లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నట్లు అగ్రిమెంట్ ఉందన్నారు.