PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్షం లో సైతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

1 min read

– గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారికి 12వ వార్డ్ నాయకులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు

– వైస్సార్సీపీ జగన్ అన్న ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు

– కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వడ్డగిరి, బాబు జీ నగర్ 12వ వార్డు 29 సచివాలయం పరిధిలోని కొనసాగింది. ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి జగనన్న చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. స్థానికంగా అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కో ఆప్షన్ మెంబెర్లు నయీమ్ పాషా , చాట్ల మేరీ ,వైస్సార్సీపీ నాయకులు నవీన్ ,ఏజాజ్ అలీ ఖాన్ ,హనీఫ్ , షైక్ షా , శ్రీను ,భాస్కర్ , సచివాలయం కన్వీనర్లు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author