PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ను మళ్ళీ గెలిపించుకోవడం మన భాద్యత..

1 min read

– సచివాలయ కన్వీనర్లు,గృహ సారథులు బాధ్యత గా పనిచేయాలి

– నందికొట్కూరులో సచివాలయాల సందర్శన

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణములోని  మారుతి నగర్-7, సాయిబాబ పేట-13, హాజీ నగర్-14 వార్డు కౌన్సిలర్ లు లాలు ప్రసాద్, సమీరా భాను, అబ్దుల్ రవూఫ్  ఆధ్వర్యంలో సోమవారం  మున్సిపల్ చైర్మన్  దాసి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు  మన్సూర్ , జె.సి.యస్ కన్వీనర్  అబూబక్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బేగ్ లు సచివాలయం సందర్శన కార్యక్రమం చేపట్టారు  . ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ   జగనన్న చేపట్డిన సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందే విధంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పని చేయాలని సూచించారు. గతంలో ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన నవరత్న పథకాల ద్వారా లబ్ధి పొందిన మెుత్తాన్ని పాంప్లేట్ రూపంలో వారి కుటుంబానికి అందించడం జరిగిందని అన్నారు. ఇల్లు లేని వారికి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని  ఇంకా ఎవరైనా అర్హత కలిగి ఉంటే వారిని గుర్తించి మా దృష్టికి తీసికొని రావాలని తెలిపారు. అదే విధంగా నవంబర్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే  అనే మరో కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వెళ్ళేందుకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు సిద్దంగా ఉండాలని అన్నారు.పట్టణ అధ్యక్షులు మన్సూర్  మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆశీస్సులతో షాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్  దాసి సుధాకర్ రెడ్డి  సహకారంతో ఎన్నడూ లేని విధంగా నందికొట్కూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారని  గత ప్రభుత్వ పాలన ప్రస్తుత జగనన్న ప్రభుత్వ పాలన కు తేడా గమనించాలని  ప్రజల్లో మార్పు రావాలని అన్నారు.జె.సి.ఎస్ కన్వీనర్ అబూబక్కర్  మాట్లాడుతూ… జగనన్న ప్రభుత్వం సంక్షేమం గురించి రాష్ట్రాలు, దేశాలు మరియు ప్రపంచ స్థాయికి చేరిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి మన జగనన్న చేస్తున్నాడని అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ జగనే ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అని అన్నారు. నవంబర్ నెలలో  ఆపు బాబు నాటకం జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమంలో బాధ్యతగా పని చేయాలని సచివాలయ కన్వీనర్లకు గృహసారధులకు పిలుపునిచ్చారు. జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్ మాట్లాడుతూ…

జగనన్న ప్రభుత్వంలో మా వార్డులో సుమారు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. జగనన్న మంచి మనసున్న మారాజు, సంక్షేమ సారధి అని జగనన్న వ్యక్తిత్వం గురించి ఒక పుస్తకం రాసిన సరిపోదని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న  మన జగనన్న ను గెలిపించుకోవడం మన భాద్యతగా తీసుకోవాలని, జగనన్న పై అభిమానంతో సచివాలయ కన్వీనర్లు , గృహ సారథులు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు చింత విజ్జి, సచివాలయ సిబ్బంది,  సచివాలయ కన్వీనర్లు అబ్దుల్ రహిమాన్, బాండ్స్ శ్రీను, సయ్యద్ రఫీ, గృహ సారధులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author