NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

175 సీట్లు గెల‌వ‌డం సాధ్య‌మే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి ప్రతి నెలా పథకాలను అందిస్తుండటాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సమన్వయం చేసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యంగా నిర్వహించే బాధ్యత మీదేనని ప్రాంతీయ సమన్వయర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజక వర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో సమావేశమవుతానని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. దీనిపై ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

                                                  

About Author