జవాన్ వీరమరణం పొందడం బాధాకరం .. మంత్రి ఎన్ఎండి ఫరూక్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో మురళి నాయక్ వీరమరణం పొందడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం పుట్ట గుండ్లపల్లి తాండకు చెందిన మురళి నాయక్ దేశం కోసం వీరుని మరణం పొందడం మనసు కల చివేసింది అన్నారు. పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన మురళి నాయక్ సత్యసాయి జిల్లా వాసి . మురళి నాయక్ వీరమరణం తెలుగు ప్రజలకే గాక దేశ ప్రజలందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. యుద్ధంలో మురళి నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. మురళి నాయక్ పవిత్ర ఆత్మకు వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు.