NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య‌, వైద్య రంగాల్లో దేశంలోనే ఆద‌ర్శంగా నిలిచేలా సంస్క‌ర‌ణ‌లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన : కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ , కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి గారు, కుమారస్వామి గారు, వైస్సార్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు, కో -ఆప్షన్ మెంబర్లు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన ఆనంద వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధిగా శ్రీ వెన్నెపూస రవీంద్రారెడ్డి గారు పోటీ చేయుచున్నారు.కావున గ్రాడ్యుయేట్ వెన్నుపూస రవీంద్రారెడ్డి రేపు జరగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకి గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా సచివాలయ ఉద్యోగాలు, వైద్య ఆరోగ్యశాఖ అత్యధికంగా నియమకాలు మరియు వివిధ శాఖలలో నియమకాలు చేపట్టి ఈ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అనే భావనతో అన్ని వర్గాల ప్రజలకు సంతృప్తికరంగా పాలన సాగిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు, కో -ఆప్షన్ మెంబర్లు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

About Author