NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు అందుబాటులో ఉండాలి..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: గ్రామ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నంద్యాల జిల్లా డివిజనల్ అధికారి ( డిఎల్ డిఓ ) జనార్దన్ రావు మండల పరిషత్తు సిబ్బంది సచివాలయం సిబ్బందికి సూచించారు. మండల కేంద్రమైన రుద్రవరంలో శుక్రవారం అయన మండల పరిషత్ కార్యాలయం సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి మండల అభివృద్ధి పారిశుధ్యం త్రాగునీరు తదితర అంశాలపై సిబ్బందిని ఆరాతీశారు. రుద్రవరంలోని 1వ, 2వ, 3వ సచివాలయాలను రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై సిబ్బందిని ఆరాతీసి సచివాలయం సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి సి సి కోఆర్డినేటర్ విజయ్ కుమార్ ఎంపీడీవో మధుసూదనరెడ్డి ఈవోపీఆర్డి భాగ్యలక్ష్మి సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.విద్యార్థులు పరిశుభ్రత పాటించాలివిద్యార్థులు పరిశుభ్రత పాటించాలని ఎస్ బి సి సి కోఆర్డినేటర్ విజయ్ కుమార్ తెలిపారు. స్థానిక కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం అయన చేతుల పరిశుభ్రత అనీమీయ వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రుద్రవరం మేజర్ పంచాయతీ ఈవోగా మహమ్మద్ రఫీమండల కేంద్రమైన రుద్రవరం మేజర్ పంచాయతీ ఈవోగా మహమ్మద్ రఫీ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం ఓర్వకల్లు గ్రామపంచాయతీలో గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఈయనను గ్రేడ్ వన్ కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ ఉన్నతాధికారులు రుద్రవరం మేజర్ పంచాయతీకి బదిలీ చేశారు. దీంతో ఆయన రుద్రవరం మేజర్ పంచాయతీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు.

About Author