అంటూ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రామగిడ్డయ్య నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దిన్నదేవరపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఎఫ్ఈసి ప్రోగ్రామ్ సందర్శించారు ఈ ప్రోగ్రాం లో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు మరియు వచ్చిన పేషంట్లందరికీ ల్యాబ్ పరీక్షలు మరియు వారికి అవసరమైన మందులు అన్నియు అందించాలని తెలిపారు ముఖ్యంగా మధ్యాహ్నం సమయం నుంచి ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించుకున్న వారందరికీ ఇంటి వద్దకు వెళ్లి డాక్టర్ వైద్య సేవలు అందించాలని వారికి అవసరమైన మందులను ఉచితంగా ఇవ్వాలని తెలిపారు ఆశ ఏఎన్ఎంలకు వారి యాపుల యందు అన్ని ప్రోగ్రామ్స్ ను అప్లోడ్ చేయాలని అన్ని ప్రోగ్రామ్స్ 100% పూర్తి అయ్యే విధంగా చూసుకోవాలని తెలిపారు మరియు ఆశ ఏఎన్ఎం గ్రామం పరిధిలో ఉన్నటువంటి పరిసరాల పరిశుభ్రతను అంటూ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని ముఖ్యంగా పంచాయతీ వారితో కలిసి పని చేయాలని మురికి కాలువలు దిబ్బలు క్లీన్ చేపించాలని డెంగు దోమల ప్రబలకుండా చూసుకోవాలని సీజనల్ వ్యాధులు అంటూ వ్యాధులు రాకుండా చూసుకోవాలని ప్రజలలో అవగాహన కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది ఆశ ఏఎన్ఎం పాల్గొన్నారు.