PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పదిలో విద్యార్థులు వంద శాతం ఉతీర్ణత సాధించేలా చూడాలి

1 min read

– జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చూడవలసిన బాధ్యత విద్యాధికారుల పై ఉందని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మండల విద్యా శాఖ అధికారులు మరియు హెడ్ మాస్టర్ లతో పదవ తరగతి పరీక్షల అంశంపై జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యా శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.. గరిష్టంగా ఒక నెల మాత్రమే సమయం ఉన్నందున ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.. టీచర్లు తెల్లవారుజామున మరియు రాత్రి సమయంలో ప్రత్యేక తరగతులు చాలా బాగా నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.. ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే మనము మన జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించగలమన్నారు. జిల్లాలో 2022-2023 సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల ద్వారా 22791 మంది విద్యార్థులు హాజరుకానున్నారు అన్నారు. టీచర్లు సబ్జెక్ట్ వైస్ గా గ్రూప్ ఏర్పాటై తయారు చేసిన మెటీరియల్ ను విద్యార్థులకు త్వరగా ఇవ్వాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఎ,బి,సి,డి గ్రేడ్ ల ప్రకారంగా విద్యార్థులను విభజించి ఉన్నారని అందులో సి,డి గ్రేడ్ లో ఉన్న విద్యార్థులను ఎ,బి గ్రేడ్ లోకి తీసుకొని రావడానికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలన్నారు. అదే విధంగా సి,డి గ్రేడ్ లో ఉన్న విద్యార్థులు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉంటారో గమనించి సబ్జెక్ట్ వైస్ గా గ్రూప్ లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.. ఏ విద్యార్థి ఇళ్లు అయిన పాఠశాల కి దూరంగా ఉంటే విద్యార్థి తల్లిదండ్రులతో చర్చించి వారికి ఇష్టం ఉంటే విద్యార్థిని తాత్కాలికంగా వసతి గృహాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మండలాల వారీగా హెడ్ మాస్టర్ లు మరియు మండల విద్యాశాఖాధికారులతో వారు పాఠశాలలో 10 వ తరగతి పరీక్షల పట్ల చేపడుతున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ పిఓ వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు సూర్య ప్రతాపరెడ్డి,శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

About Author