అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ చదవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఆజాదికా అమృత మహోత్సవ్ లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని మహిళా మండలి లక్ష్మి ప్రాంగణంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీఓ బి.జయంతి ఆధ్వర్యంలో ఈకార్యక్రమం జరిగింది.నాభూమి-నాదేశంలో భాగంగా అమరవీరులను స్మరించుకుంటూ ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,ఎంఈఓ శ్రీనాథ్, ఏపీఎం సుబ్బయ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని దేశ సమైక్యత కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.విద్యార్థి దశ నుంచే విద్యార్థిని విద్యార్థులు విద్యనభ్యసిస్తూనే దేశం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను మరువకుండా, మన భూమిని సాటి మనిషిని ప్రేమించే తత్వం,పుడమి తల్లిని కాపాడుకునే అలవాటు అలవర్చుకొని ఎదగాలని ఎంపీడీవో మరియు ఏపీఓ జయంతి అన్నారు.తర్వాత ఐకెపి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలను వారు నాటారు. అదేవిధంగా నిన్న దేవనూరు గ్రామంలో ఇదే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏపీవో తెలిపారు.ఈకార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ రాములమ్మ,ఫీల్డ్ అసిస్టెంట్లు మధు,వెంకటేష్,రవి,సిఓలు చిన్నబాబు,ఉషారాణి మరియు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.