PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘లక్ష్యం’తోనే…చదవాలి

1 min read

– విద్యార్థులు ఇష్టమైన రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి

 – ఇంటెలిజెన్సీ డి.ఎస్.పి వెంకటరాముడు, అమీలియా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లక్ష్మి ప్రసాద్

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కర్నూలు ఇంటలిజెన్స్ డి.ఎస్.పి వెంకటరాముడు, అమీలియా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ సూచించారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన 66వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్  డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ సిమ్మింగ్ ఛాంపియన్షిప్ – 2023లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వై. దేవ్ సృత్ సాయి, కె. శృతి లను జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సీ క్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఘనంగా సన్మానించి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురవలు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉన్నతంగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలన్నారు. కురువ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు, అసోసియేట్ అధ్యక్షులు కె. క్రిష్టన్న గుడిసె శివన్న మాట్లాడుతూ కురువ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పెద్దపాడు వద్ద నిర్మిస్తున్న బీరప్ప స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో కురువలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం కోశాధికారి కె. సి. నాగన్న , టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు ప్రతి ఓబులయ్య,  వడ్డేమాన్ జడ్పీహెచ్ఎస్ గణిత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి అధ్యక్షులు రవికుమార్,  సంఘం మహిళ ప్రతినిధి లీలా మాట్లాడారు. పర్ల గ్రామానికి చెందిన పాల సుంకన్న,  గ్రామ కమిటీ పెద్దలు శృతికి రూ. 10 వేలు ఆర్థిక ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో  అమీలియా హాస్పిటల్స్ అడ్వైజర్ సరళ ప్రసాద్, సంఘం నాయకులు  తిరుపాలు, రామకృష్ణ, ధనుంజయుడు, నాగ శేషన్న, వెంకటేశ్వర్లు, టీచర్ కృష్ణ ,సోమన్న , రామాంజనేయులు ,శ్రీనివాసులు ,చిరంజీవి ,చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author