PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మా చెల్లి పెళ్లి జ‌ర‌గాలి.. మ‌ళ్లీ మ‌ళ్లీ ’ అన్నట్టుంది: ఆర్ఆర్ఆర్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : న‌వ సూచ‌న‌ల పేరుతో న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు ఏపీ సీఎం జ‌గ‌న్ కు మ‌రో లేఖ రాశారు. 2023 నాటికి ప్రతి కుటుంబానికి సొంతింటి క‌ల నెర‌వేర్చడం మ‌న ప్రభుత్వ సంక‌ల్పమ‌ని అన్నారు. 31 ల‌క్షల కుటుంబాల కోసం.. 17 వేల కాల‌నీల నిర్మాణానికి ప్లాన్ వేశార‌ని, 56 వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేశారని అన్నారు. ఇప్పుడు 70 వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నాలు వేశారని చెప్పారు. జులై 4న మ‌రోసారి శంకుస్థాప‌న చేస్తున్నార‌ని తెలిసింద‌ని, ఇలా విడ‌త‌ల వారీగా శంకుస్థాప‌న‌లు చేయ‌డం చేస్తుంటే.. య‌మ‌లీల సినిమాలోని డైలాగ్ ‘ మా చెల్లి పెళ్లి జ‌ర‌గాలి. మ‌ళ్లీ, మ‌ళ్లీ ’ అన్నట్టు ఉంద‌ని ర‌ఘురామ ఎద్దేవా చేశారు. అమృత్ ప‌థ‌కం ద్వార గ‌త ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎందుకు ఇవ్వడం లేద‌ని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణం చేసేట‌ప్పుడు క‌నీస సౌక‌ర్యాల క‌ల్పన గురించి కూడ ఆలోచించాల‌ని అన్నారు.

About Author