ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుని భార్య మృతి
1 min read-నివాళి అర్పించిన శాప్ చైర్మన్ మరియు నాయకులు
పల్లెవెలుగు,మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూ రు గ్రామానికి చెందిన ఐటీ వింగ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి ప్రతిమ(38) శనివారం తెల్లవారు జామున మృతి చెందారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఈమెకు గుండె నొప్పి రావడంతో హైదరాబాదులో శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు మియాపూర్ నుండి యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లారు.అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె మృతి చెందినట్లు వారు తెలిపారు. ఈమెకు ఒక కూతురు నివేదిత ఉన్నారు.ఈమే అందరితో మంచిగా పలకరిస్తూ ఉండేదని ఈమె మృతి పట్ల కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల్లో గ్రామంలో విషాదఛాయలు అమ్ముతున్నాయి.విషయం తెలుసుకున్న శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెంటనే హైదరాబాద్ మియాపూర్ లో ఉన్న స్వగృహానికి వెళ్లి ఆమె పార్తీ వదేహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను ఆయన ఓదారుస్తూ ధైర్యాన్ని ఇచ్చారు. ఈమె అంత్యక్రియలు శనివారం సాయంత్రం హైదరాబాదులో నిర్వహించారు.నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,జడ్పీటీసీ పర్వత యుగంధర్ రెడ్డి,మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,మల్లు శివ నాగిరెడ్డి,సర్పంచ్ నాగ స్వామి రెడ్డి,సుంకేసుల రాముడు, బన్నూరు బలరాముడు, సుదర్శన్ రెడ్డి,కృష్ణారెడ్డి, రమణారెడ్డి,సాంబశివుడు, శ్రీనివాసులు,షేక్ అహ్మద్, బ్రహ్మం మరియు వివిధ గ్రామాల నాయకులు ప్రజా ప్రతినిధులు పూలమాలలతో నివాళులు అర్పించారు.