చంద్రబాబు, వైఎస్సార్ ఉన్నప్పుడే బాగుండేది !
1 min readపల్లెవెలుగువెబ్: బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కాంట్రాక్ట్ ని బీజేపీ అప్పగించిందని ఆరోపించారు. ఒక కాంట్రాక్టర్ అహం కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. ఉద్యమం సమయంలో ఈ బఫూన్ గాళ్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అడ్రస్ లేని లవంగం గాళ్లంతా ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, వైయస్సారే బెటర్ అని… ఇప్పుడు బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. పిచ్చోళ్లతో పోరాడాల్సి వస్తోందని చెప్పారు. తాము చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.