NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐటీడీపీకి..భరోసా…

1 min read

బాధిత ఐటీడీపీ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం

పార్టీ కోసం పని చేసే వారి సేవలు మరిచిపోము..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

పల్లెవెలుగు: తెలుగుదేశం పార్టీ ఆధ్వరంలో కడప లో జరిగిన జోన్- 5 సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన కడప ఐటీడీపీ పార్లమెంట్ ప్రధానకార్యదర్శి నరసింహ కుటుంబానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐటీడీపీ విభాగం తరపున రెండు లక్షల రూపాయలను వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర ఐటీడీపీ సభ్యులు శివ కృష్ణ , కర్నూల్ పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షుడు తిలక్ గట్టు , రాష్ట్ర అధికార ప్రతినిధి  రాజశేఖర్ గౌడ్ , కడప ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబిద్ కలిసి అందించారు. ఐటీడీపీ తరపున నరసింహ ఎంతో కష్టపడి పనిచేశారని… నారా చంద్రబాబు నాయుడు  కూడా ఐదు లక్షల రూపాయలను ఇస్తానని ప్రకటించారు. అలానే వారి కూతురు చదువు అంతా కూడా పార్టీ నే చూసుకుంటుంది అని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ కోసం పని చేసే వారి సేవలను మరిచిపోమని ఐటీడీపీ సభ్యులకు  ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

About Author